కెనడాలో బహిష్కరణ వేటుకు గురైన 700 మంది భారత విద్యార్థులకు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో భరోసానిచ్చారు. ‘విద్యార్థుల బహిష్కరణ వేటు అంశం గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూనే ఉన్నాను. విదేశాల నుంచి వచ్చే విద్యార్థులు మా దేశ ప్రగతికి ఎంతగానో దోహదపడుతున్నారు. బాధితులకు అండగా ఉంటాం’ అని పేర్కొన్నారు. కాగా విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న కన్సల్టెన్సీలపై చర్యలు తీసుకోవాలన్న బిల్లును పార్లమెంటు ఆమోదించింది.