తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఎలమంచిలి నియోజకవర్గ అచ్యుతాపురంలో స్థానిక ఎస్ ఆర్ కె ఫంక్షన్ హాల్ నందు భవిష్యత్తు గ్యారెంటీ నియోజకవర్గ చర్చా వేదిక మరియు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నియోజవర్గ ఇంచార్జ్ శ ప్రగడ నాగేశ్వరరావు అధ్యక్షతన శనివారం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశమునకు ముఖ్య అతిథులుగా అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బుద్ధ నాగజగదీష్ , నియోజకవర్గ పరిశీలకులు బోండా జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్చార్జి ప్రగడ నాగేశ్వరావు మాట్లాడుతూ జాతీయ అధ్యక్షులు మినీ మేనిఫెస్టోను మహానాడులో ప్రారంభించడం జరిగిందని,. ఈ యొక్క మేనిఫెస్టోను ప్రజలందరూ దగ్గరికి తీసుకు వెళ్ళవలసిన బాధ్యత ప్రతి తెలుగుదేశం నాయకుడు మరియు కార్యకర్త మీద ఉందని చెప్పారు.
మహిళలకు తెలుగుదేశం పార్టీ ద్వారానే మంచి జరుగుతుందని, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు వరకు ప్రతి మహిళకు స్త్రీ నిధి ద్వారా నెలకు 1500 రూపాయలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తారని, అలాగే దీపం పథకం ద్వారా ప్రతి రేషన్ కార్డుదారునికి సంవత్సరమునకు మూడు గ్యాస్సిలిండర్ లు ఉచితంగా ఇస్తామని చెప్పారు. బుద్దా నాగ జగదీశ్వర్ మాట్లాడుతూ బీసీలకు రక్షణ కోసం బీసీ చట్టం తెలుగుదేశం పార్టీ తీసుకువస్తుందని, అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్ ని ప్రారంభిస్తుందని మరెన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తుందని కార్యకర్తలు అందరికీ వివరించారు.
ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రాజాన రమేష్ కుమార్, ధూళి రంగనాయకులు , రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి భీమరశెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహ కార్యదర్శి దాడి ముసలి నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు జనపరెడ్డి నర్సింగరావు, వసంతవాడ దిన్ బాబు, దొడ్డి శ్రీనివాసరావు, గొర్లే నానాజీ, ఇత్తంశెట్టి రాజు, అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కొలుకులూరి విజయబాబు, జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి రాజన్న సూర్య నాగేశ్వరరావు, జిల్లా టియన్టీయుసి ప్రధాన కార్యదర్శి పొనమళ్ళ కొండబాబు, ఎంపీటీసీ నీరుకొండ నర్సింగరావు, కౌన్సెలర్ మజ్జి రామకృష్ణ, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు పెంటకోట విజయ్, జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు గొన్న బత్తుల శేషు, రాష్ట్ర బీసీ సెల్ కార్యనిర్హ కార్యదర్శి కసిరెడ్డి అప్పలస్వామి నాయుడు (ప్రసాద్ ), నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు కొఠారి సాంబశివరావు, క్లస్టర్ ఇంచార్జిలు , తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.