రోడ్డుపైన ఏదైనా వస్తువు దొరికితే ఏం చేస్తారు.. ఇంకేముంది చక్కగా జేబులో పెట్టుకుని అక్కడి నుంచి మెల్లిగా జారుకునే రోజులివి. కానీ కాకినాడలో ఓ డెలివరీ బాయ్ నిజాయితీని చాటుకున్నాడు. తనకు దొరికిన బ్యాగ్‌ను తిరిగి పోలీసులకు అప్పగించి ప్రశంసలు అందుకున్నాడు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెంకు కుడిపూడి సత్యవేణి శుక్రవారం బైక్‌పై వెనుక కూర్చుని వస్తుండగా కాకినాడ కల్పనా సెంటర్ సమీపంలో.. ఆమె చేతిలో ఉన్న హ్యండ్ బ్యాగ్ జారి కిందపడిపోయింది. ఆ బ్యాగులో రూ.50 వేల డబ్బులు, ఒక మొబైల్, కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆమె బ్యాగ్ కిందపడిపోయినా సరే పట్టించుకోలేదు.
ఆ బ్యాగ్ అటుగా వెళుతున్న జొమాటో డెలివరీ బాయ్ పనిచేస్తున్న కాకినాడకు చెందిన పోసిన దినకర్‌కు దొరికింది. అతడు వెంటనే ఆ బ్యాగ్‌ను తీసుకుని నిజాయితీగా తీసుకొచ్చి కాకినాడ క్రైం డీఎస్పీ రాంబాబుకు అందజేశాడు. ఆ బ్యాగ్‌లోని అడ్రస్ ప్రకారం బ్యాగ్‌ను పోగొట్టుకున్న సత్యవేణిని పిలిపించి దినకర్ సమక్షంలోనే అందజేశారు. నిజాయితీ పరుడైన డెలివరీ బాయ్ దినకర్‌ను పోలీసులు, స్థానికులు అభినందించారు.