జగనన్నకి చెబుదాం కార్యక్రమంలో వచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆయా శాఖల అధికారులు అర్జీదారులకు సంతృప్తికర పరిష్కారం చూపించి, నివేదికలను సమర్పించాలని తెలిపారు. సోమవారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, ఐ టి డి ఎ, ప్రాజెక్ట్ అధికారి సి. విష్ణు చరణ్ లతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ప్రజలు పలు సామాజిక, వ్యక్తిగత అంశాలపై 76 అర్జీలు అందజేశారు. అర్జీల వివరాలు పాచిపెంట మండలం తామరాపల్లి గ్రామపంచాయతీలో అనేక గ్రామాలు ఉన్నాయని గ్రామనికి గ్రామానికి మధ్య సరైన రోడ్డు సదుపాయం లేక ప్రజలు రాకపోకలకు చాలా ఇబ్బంది పడుతున్నారని గ్రామపంచాయతీలో ఉన్న గ్రామాలకు బీటి రోడ్ మంజూరు చేయాలని గ్రామ సర్పంచ్ డి. సీతమ్మ, గ్రామస్తులు కోరారు. పాచిపెంట మండలం వడిసెలమడ గ్రామానికి చెందిన గిరిజనులు వారు సాగు చేసుకుంటున్న అటవీ భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు, కుడుమూరు మెట్టవలస జంక్షన్ నుండి వడిసెలమడ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని, గ్రామంలో ఆరు నెలలుగా మంచి నీటి పధకం మోటార్ పనిచేయడం లేదని వేసవిలో మండుటెండలో భావినీరు తోడుకోవడానికి ఇబ్బందులు పడుతున్నామని కొత్త మోటర్ వేసి పైపుల ద్వారా నీరు అందించాలని ఆర్. వేణు, గ్రామస్తులు దరఖాస్తు అందజేశారు.
పాచిపెంట మండలం కందిరివలస గ్రామం లో ఉన్న ప్రజలకు ఉపాధి కొరకు పాడి ఆవులు మరియు పి. టి. జి. గొర్రెల లోన్లు మంజూరు చేయాలని పి. లక్ష్మి దరఖాస్తు అందజేశారు. గరుగుబిల్లి మండలం వల్లిరిగోడవ గ్రామానికి చెందిన గాదాపు ధనుంజయ నాయుడు తన భూమికి రీ సర్వే జరిపించాలని కోరారు. కొమరాడ మండలం సివిని గ్రామానికి చెందిన అలజంగి లక్ష్మి ఎం. పి. హెచ్. డబ్ల్యు. ట్రైనింగ్ పూర్తి చేసి ఉన్నానని ఏదైనా ఉపాధి కల్పించాలని వినతి పత్రం సమర్పించారు. బలిజిపేట మండలం గౌరీపురం గ్రామానికి చెందిన జి. సత్యవతి గ్రామంలో అంగన్వాడీ టీచర్ గా పనిచేయుటకు దరఖాస్తు చేసానని, కానీ ఇంతవరకు ఎటువంటి సమాచారం లేదని బలిజిపేట మండలంలో అంగన్వాడి టీచర్ నియామకాలను త్వరగా పూర్తిచేసి ఉద్యోగ అవకాశాన్ని కల్పించాలని దరఖాస్తు అందజేశారు. పార్వతీపురం పట్టణానికి చెందిన కె. పార్వతి తనకు రక్షణ కల్పించవలసిందిగా, స్వార్జితమైన వ్యవసాయ భూమిని రక్షించాలని, మానసికంగా వేదనకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అర్జీ అందజేశారు. పార్వతిపురం మండలం నరసిపురం గ్రామానికి చెందిన టి. అప్పలనాయుడు సర్వే నెంబర్ 486 గల భూమికి డి పట్టా ఇప్పించాలని వినపత్రం సమర్పించారు.
గ్రీన్ అంబాసిడర్ ఉద్యోగులకు గత 9 నెలలుగా జీతభత్యములు అందడం లేదని, జీతాలు ఇప్పించవలసిందిగా బి. మహేష్, ఇతరులు కోరారు.
పాలకొండ మండలం తంపటపల్లి గ్రామానికి చెందిన గొర్లి సత్యం నాయుడు ఖాతా నెంబర్ 318 లో గల మా భూమిని వేరే వాళ్ళు అక్రమణ చేసి ఉన్నారని వారిపై చర్యలు తీసుకొని భూమి అప్పగించాలని కోరారు.
కురుపాం మండలం బారతింగి గ్రామానికి చెందిన కె. కాంతారావు తనకు రెండు ఎకరాలు భూమి ఉందని, భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తున్నానని నాకు స్ప్రేయింగు మిషన్ ను మంజూరు చేయవలసిందిగా కోరారు.
జియ్యమ్మవలస మండలం బట్టభద్ర గ్రామానికి చెందిన ఏ. శాంతమ్మ ఆర్ ఆర్ ప్యాకేజ్ ను మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రామచంద్ర రావు, డి. ఆర్. డి. ఏ ప్రాజెక్టు డైరెక్టర్ పి. కిరణ్ కుమార్, జిల్లా ఆర్. డబ్ల్యు. ఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకర రావు, గ్రామ, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం. డి. నాయక్, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి. జగన్నాథరావు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa