సహజీవనంపై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లివ్ ఇన్ రిలేషన్ షిప్ ను మ్యారేజ్ గా చట్టం గుర్తించదని హైకోర్టు పేర్కొంది. వ్యక్తిగత మరియు లౌకిక చట్టాల ప్రకారం జరిగే వివాహాలు చట్టబద్ధమైన వివాహాలుగా గుర్తించబడతాయి అని తెలిపింది. అయితే ఒప్పందం ప్రకారం సహజీవనం చేసే జంట దాన్ని వివాహంగా చెప్పలేరని, సహజీవనంలో విడాకులు కోరడం కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. చట్టాల ప్రకారం వివాహం చేసుకోలేదని, సహజీవనంలో ఉన్న జంట విడాకులు పిటిషన్ ను కేరళ హైకోర్టు కొట్టేసింది.