మనిషి తన జీవన ప్రణాళికలో మార్పులు చేయకపోతే బరువు తగ్గడం అసాధ్యమనే చెప్పుకోవచ్చు. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత దినచర్యలోభాగంగా కొన్ని అలవాట్లు చేసుకుంటే బరువు ఈజీగా తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే నిద్రలేవడం వల్ల బరువు నియంత్రణలో ఉండటంతోపాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. 10-15 నిమిషాలు వ్యాయామం, ధ్యానం చేయాలి. దీంతో రక్త ప్రసరణ మెరుగుపడుతుందన్నారు. అలాగే రోజూ గాస్లు గోరువెచ్చని నీళ్ల తాగాలన్నారు. శరీరం కొవ్వు కరగడంతోపాటు జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుంది.