ఒక్క ప్రశ్న వందల కోట్ల వ్యూస్ సాధించింది. ఒక్క ట్వీట్.. ఏకంగా 100 కోట్లకు పైగా వ్యూస్.. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. వంద కోట్లు.. అంటే భూమ్మీద ఉన్న జనాభాలో ప్రతి ఏడుగురిలో ఒకరు ఈ ట్వీట్‌ను చూశారన్నమాట. ట్విట్టర్ చరిత్రలోనే ఇది నయా రికార్డ్. ఇంతకీ ఆ ట్వీట్ ఏంటో తెలుసా? ‘గూగుల్‌లో చూడకుండా ఒక ప్రసిద్ధ చారిత్రక యుద్ధం పేరు చెప్పండి’. ఈ ట్వీట్ ప్రపంచాన్ని విపరీతంగా ఆకర్షించింది.
నెల రోజుల్లోనే 100 కోట్ల వీక్షణలు సొంతం చేసుకున్న ఆ ట్వీట్ చేసిన ఖాతాకు ఉన్న ఫాలోవర్ల సంఖ్య కేవలం 11 వేలే కావడం మరో విశేషం. ఈ ట్వీట్ గురువారమే 100 బిలియన్ వ్యూస్ సొంతం చేసుకోవడంతో దాన్ని పోస్టు చేసిన సారా బెల్లమ్ అనే యూజర్ ‘గుడ్ షాంపేన్’తో పండుగ చేసుకున్నారు.
ఒక ట్వీట్ 1.1 బిలియన్ వ్యూస్ సొంతం చేసుకోవడంపై యూజర్లు ఆశ్చర్యంగా స్పందిస్తున్నారు. ‘నిజమా?.. వంద బిలియన్ వ్యూసా?’ అని షాకవుతున్నారు. మరికొందరు మాత్రం ట్విట్టర్ మెట్రిక్‌పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ ట్వీట్ ఇప్పుడు సంచలనాలు సృష్టిస్తోంది. దీనిని 2,127 మంది రీట్వీట్ చేయగా, 85.5 వేల కోట్స్, 18.9 వేల లైకులు, 10.5 బుక్‌మార్క్స్ సొంతం చేసుకుంది.