ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇల్లు అద్దెకు ఇచ్చేప్పుడు జాగ్రత్త,,తిరుపతివాసులకు పోలీసుల అలర్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 21, 2023, 05:51 PM

తిరుపతితో పాటూ తిరుమలవాసుల్ని పోలీసులు అప్రమత్తం చేశారు. ఇళ్లు అద్దెకు ఇచ్చే విషయంలో అప్రమత్తత అవసరం అంటున్నారు ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి. కొందరు భక్తుల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్నారు. తిరుపతిలోని బస్టాండు, రైల్వేస్టేషన్, టీటీడీ సత్రాల దగ్గర బిచ్చగాళ్ల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై ఫోకస్ పెట్టాలన్నారు. అలాంటి వారిని గుర్తించి నగరం వదిలివెళ్లేలా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నేరాల నియంత్రణకు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేస్తామని.. గంజాయి అరికట్టేందుకు పాత నేరస్థులపై నిఘా పెట్టాలన్నారు. ఫుట్‌పాత్‌లు, రోడ్లు ఆక్రమించే షాపులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


LHMS APP సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా ప్రజలకు మెరుగైన అవగాహన కల్పించాలన్నారు. పిక్ పాకెట్, మొబైల్ దొంగతనాలకు పాల్పడే నేరస్తులపై కఠినంగా వ్యవహరించాలన్నారు. చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న గ్రేవ్ & నాన్ గ్రేవ్ కేసులు, మర్డర్, డెకాయిట్, దోపిడీ, ప్రాపర్టీ, వాహనాలు దొంగతనం, మిస్సింగ్ కేసులు, చీటింగ్ కేసులు, సైబర్ నేరాలు, ఇతర కేసులను సమీక్షించారు.


పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ కేసుల వివరాలు, ప్రస్తుత కేసుల స్థితిగతులు, నమోదైన కేసుల్లో నేరస్తుల అరెస్టు, కేసు దర్యాప్తు తీరుతెన్నులపై సంబంధిత పోలీస్ అధికారులతో ఆరా తీశారు. కేసులను చేధించడానికి, వాటి పరిష్కారానికి, నేర నియంత్రణకు దోహదం చేసే పలు సూచనలు మరియు మెళకువలను అధికారులకు తెలుపుతూ దిశా నిర్దేశాలు చేశారు. SHOలు తమ పరిధిలో నివాసమున్న రౌడీ షీటర్లను, అనుమానితులను, రాజకీయ/సామాజిక ట్రబుల్ మాంగర్స్, అసాంఘిక శక్తుల యొక్క కదలికలపై నిరంతర నిఘా ఉంచి తరచుగా కౌన్సిలింగ్ ఇస్తూ, శాంతి భద్రతల పరిరక్షిస్తూ, నేర నియంత్రణ కొరకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.


VPO/WPO వ్యవస్థను బలోపేతం చేసి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టడంలో మరియు నాన్ బెయిలబుల్ వారంట్స్ (N.B.W) ను జారీ చేయడంలో చిత్త శుద్ధితో పనిచేయాలని, అక్రమ రవాణాపై ప్రతేక బృందాలతో నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయాలని, తద్వారా ముందస్తు సమచారం సేకరించి అక్రమ రవాణా కట్టడికి చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో రోడ్డుకు ఇరువైపులా ఫుట్ పాత్‌ల మీద రోడ్లమీద వ్యాపార దుకాణాలు కబ్జా చేసి రోడ్లను ఇరుకుగా తయారుచేసిన వారిపై చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. అప్పుడే నగరంలో ట్రాఫిక్ సమస్యను వీలైనంత మేరకు తగ్గించ వచ్చని ట్రాఫిక్ & లా అండ్ ఆర్డర్ పోలీసులను ఆదేశించారు. నగరంలో రోజుకు ఒక కూడలి దగ్గర స్పెషల్ పార్టీ సిబ్బంది సహకారంతో ఆకస్మిక వాహన తనిఖీలను నిర్వహించి ట్రిపుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్, స్నేక్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి కేసుల నమోదును చేసి రోడ్డు ప్రమాదాలను నివారించాలని అధికారులను ఆదేశించారు.


గంజాయి మత్తులో ఉన్న వ్యక్తులు తమని తాము మర్చిపోయి, విచక్షణారహితంగా ప్రవర్తిస్తూ నేరాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. గంజాయి వినియోగం పై ప్రజలలో విస్తృతమైన అవగాహన సదస్సులు నిర్వహించాలని.. గంజాయి వ్యవహారానికి సంబంధించిన వ్యక్తులపై కఠినమైన క్రిమినల్ కేసులను నమోదు చేయాలన్నారు. గంజాయి సరఫరా చేసే ముఠాలపై నిఘా పెట్టాలని.. ఆకస్మిక తనిఖీలను నిర్వహిస్తూ గంజాయి అక్రమ రవాణా, సరఫరా, వినియోగం జరగకుండా నియంత్రణ చర్యలు తీసుకోవాలన్నారు.


విజిబుల్ పోలీసింగ్ ప్రక్రియను అమలు చేసి పిక్ పాకెట్, మొబైల్ దొంగతనాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలని సూచించారు. సాంప్రదాయ పోలీసింగ్ లో భాగమైన వేగు వ్యవస్థను బలోపేతం చేసి ఓపెన్ బూజింగ్, NDPS కేసులకు సంబంధించిన వారిపై దృష్టి పెట్టి, నగరంలో గంజాయి ఆనవాళ్లు, అవశేషాలు కానీ లేకుండా చేయాలన్నారు. ఫిర్యాదుదారుల పట్ల పోలీస్ అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా, హుందాగా మాట్లాడి, వారి సమస్యను విని ఫిర్యాదును స్వీకరించాలని సూచించారు. ఫిర్యాదుదారులతో పొగరుగా, దురుసుగా ప్రవర్తించరాదని.. సిబ్బందికి కేటాయించిన విధులను చిత్తశుద్ధితో నిర్వర్తించాలని, మీ పద్ధతిని మార్చుకోకపోతే మీ పై శాఖా పరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. తిరుపతిలో శాంతి భద్రతలను కాపాడుతూ, నేర నియంత్రణ, నివారణ చేస్తూ ప్రజలు జీవించటానికి ప్రశాంతమైన వాతావరణాన్ని ఇవ్వడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను ఎస్పీ అందించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa