కాకినాడకు చెందిన మత్స్యకారుడు గేదల అప్పారావు మరో ఐదుగురితో కలిసి బోటులో చేపల వేటకు వెళ్లాడు. రాత్రి సమయంలో వలవేసి పడుకున్నాడు. మూత్ర విసర్జనకు లేచిన అప్పారావు అదుపుతప్పి సముద్రంలో జారిపడ్డాడు. అయితే ఆ సమయంలో జోరుగా గాలులు వీయడంతో బోటు దూరంగా వెళ్లిపోయింది. దాంతో మరోమార్గం లేకపోవడంతో ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చే ప్రయత్నం చేశాడు. మరుసటి రోజు అంతర్వేది నుంచి వేటకు వెళ్లిన విశాఖ మత్స్యకారులు అప్పారావును గమనించి కాపాడారు. 12 గంటలపాటు సముద్రంలో ఈదుకుంటూ వచ్చిన అప్పారావును రాజోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.