అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరుకు చెందిన లారీ డ్రైవర్ తెనాలిలో అదృశ్యమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రైల్వే కోడూరుకు చెందిన 60 ఏళ్ల చిన యానాదయ్య లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఈ నెల 20వ తేదీన తెనాలి పట్టణ మోరిస్ పేటకు వచ్చి కనిపించకుండా పోయాడు. అతని కుమారుడు యశ్వంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం రాత్రి కేసు నమోదు చేసినట్టు త్రీ టౌన్ ఎస్ఐ ఎం. విజయ్ కుమార్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa