గుండెపోటుతో లారీ డ్రైవర్ మృతి చెందిన సంఘటన సోమవారం వెలుగు చూసింది. నిడమానూరు ప్రాంతానికి చెందిన గంధం. వెంకటేశ్వరరావు (61) లారీలో పాలను డెలివరీ చేస్తుంటాడు. ఈ క్రమంలో పాలతో తన వాహనంలో చిత్తూరు బయలు దేరాడు. చిలకలూరిపేట పట్టణంలోని ఎన్ఆర్డీ సెంటర్ సమీపంలో రాత్రి లారీని పార్క్ చేసి, అందులో నిద్రపోయాడు. నిద్రలోనే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. సోమవారం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa