పోలవరం గైడ్‌బండ్ కుంగుబాటు కారణాలను అధ్యయనం చేసిన పాండ్యా కమిటీ సిఫారసులు ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి చేరలేదు. మరోవైపు గోదావరి వరద ముంపు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో గైడ్‌బండ్‌కు తాత్కాలిక మరమ్మతులు నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళికను ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి సోమవారం కేంద్ర జల సంఘానికి పంపారు. ఈలోగా తాత్కాలిక మరమ్మతుల పేరుతో గైడ్ బండ్ కుంగిన ప్రాంతాన్ని రాళ్లతో కప్పే ప్రయత్నం చేస్తున్నారు. తాత్కాలిక మరమ్మతులపైనా కేంద్ర జలసంఘం నుంచి సూచనలు రావాల్సిఉంది. నెలాఖరులోగా కేంద్రం స్పందిస్తే సాంకేతికపరమైన పనులు ప్రారంభించే వీలుందని, లేకుంటే కష్టమేనని భావిస్తున్నారు.