ఏలూరు శ్రీరామ్ నగర్ తొమ్మిదో రోడ్డులోని ఒక ఇంట్లో దొంగతనం జరిగి 24 గంటలు గడవక ముందే అదే రోడ్డులో మరో ఇంట్లో పట్టపగలు దొంగతనం జరిగింది. శ్రీరామ్ నగర్‌లో నివాసం ఉంటున్న కోమవరపు రత్నకుమారి సోమవారం ఉదయం 10 గంటలకు ఇంటికి తాళం వేసి వ్యక్తిగత పనుల నిమిత్తం బయటకు వెళ్లి సాయంత్రం వచ్చారు. వచ్చేటప్పటికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఇంట్లోని బీరువా పగుల గొట్టి అందులోని 20 కాసుల బంగారు ఆభరణాలు, రూ. లక్ష నగదు, 15 తులాల వెండి అపహరించినట్టు గుర్తించారు. త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏలూరు క్రైం సీఐ సీహెచ్ వి.మురళీకృష్ణ, సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం ఎస్‌ఐ బి. రాధాకృష్ణ , సిబ్బంది ఆధారాలను సేకరించారు. ఈనెల 25న శ్రీరామ్ నగర్ 9వ రోడ్డులోనే నల్లి దుర్గ వెంకట పద్మ నాగేంద్రరావు ఇంటిలో దొంగ లు పడి 175 కాసుల బంగారు ఆభరణాలను అపహరించుకుపోగా పోలీ సులు కేసు నమోదు చేశారు. అదే ప్రాంతంలో మరోసారి సోమవారం పట్టపగలు దొంగతనం జరగడంతో శ్రీరాంనగర్ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.