పోలవరం నిర్వహిస్తులకు విరాళాల సేకరణ ఈనెల 20 నుండి జూలై 4 వరకు 15 రోజులు చేపట్టనున్న విరాళా సేకరణ కు సిపీఎం పార్టీ తన వంతు అందించడం జరుగుతుందని సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు మన్మధరావు అన్నారు. పోలవరం నిర్వాసితుల కోసం 400 కిలోమీటర్లు వందలాది మందితో నెల్లిపాక నుండి విజయవాడ వరకు కొనసాగుతున్న పోలవరం నిర్వాసితుల పాదయాత్ర కుపార్వతీపురం మన్యం బలిజిపేట లోని సిపిఎం పార్టీ నాయకుల విరాళాలు సోమవారం సేకరించారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా సభ్యులు యమ్మ ల మన్మధ రావు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పునరావాసం తో కూడిన పరిహారం ఇవ్వాలని, గోదావరి వరదల నుండే రక్షించడానికి ప్రభుత్వాలు ముందస్తు సహాయకు చర్యలు చేపట్టాలని గత ఏడాది వరదల్లో నష్టపోయిన వారికి పరిహారం చెల్లించాలని తప్పులు తడకగా ఉన్న కాంట్రాక్టు లెక్కలను మార్చాలని ఆయన తెలిపారు పోలవరం మహాపాదయాత్ర ప్రారంభమైందని ఆ పాదయాత్రకు సంఘీభావంగా జూన్ 26 నుండి రాష్ట్రవ్యాప్తంగా సంఘీభావ నిధి సేకరించడానికి సీ పిఎం పార్టీ పూనుకుందని దీనిలో భాగంగా విరాళాలు మండలంలో సేకరిస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ఆవు సాంబమూర్తి, నల్ల ఈశ్వరరావు బొద్ధాన బాను. గంట్యాడ బలరాం నాయుడు తదితరలు పాల్గొన్నారు.