రాష్ట్ట్ర ఆర్టీసీ చైర్మన్ దుగ్గాయపల్లె మల్లిఖార్జునరెడ్డి అనుచరుడు వైసీపీ నేత శ్రీనివాసరెడ్డి హత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. హత్య కేసులో ప్రధాన నిందితుడు ప్రతా్‌పరెడ్డితో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు పంపారు. ఇక ఈ కేసులో కుట్రకోణం ఇతరుల ప్రమేయంపై ఆరా తీసేందుకు... నిందితులను కస్టడీకి తీసుకుని విచారించేందుకు పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాగా ఈ కేసులో అనుమానితులుగా ఉన్న పెండ్లిమర్రికి చెందిన వైసీపీ నేత, కడప చిన్నచౌకులో పెట్రోలు బంకు నిర్వహిస్తున్న రామ్మోహన్‌రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేయడం వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. మృతుడు, నిందితులు, అనుమానితులంతా మూడునెలల క్రితం వరకు ఒకేగ్యాంగ్‌గా ఉండేవారంటారు. అడ్డదిడ్డంగా బెదిరింపులతో కోట్లాది రూపాయల భూములు స్వాధీనం చేసుకోవడం, కొందరికి బినామీగా ఉండ డం, లావాదేవీల్లో తేడా రావడంతో ప్రధాన నిందితుడు ప్రతా్‌పరెడ్డి మరికొందరితో కలిసి శ్రీనివాసరెడ్డిని హత్య చేసిన విష యం తెలిసిందే. ప్రతా్‌పరెడ్డి నుంచి ఇప్పటికే రూ.60కోట్లు విలువ చేసే 40 డాక్యుమెంట్లు, ఒక డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు చెబుతారు.