పెళ్లి అనే బంధాన్ని రోడ్డుపైకి తీసుకురాలేమని, కానీ ఓ దత్తపుత్రుడు మన రాష్ట్రంలో హిందూ సంప్రదాయాన్ని విస్మరించి, పెళ్లి అనే బంధాన్ని రోడ్డుపైకి తీసుకువచ్చారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పార్వతీపురం జిల్లా కురుపాం నియోజకవర్గం పర్యటనలో భాగంగా బుధవారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఓ ప్యాకేజీ స్టార్ వారాహి అనే లారీ ఎక్కి తనకి ఇష్టం వచ్చినట్లు, తనకు నచ్చని వారిపై ఊగిపోతూ మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. దత్తపుత్రుడు నోటికి అదుపు లేదు, నిలకడా లేదని, నలుగురిని పెళ్లి చేసుకుని భార్యలను మార్చే సంస్కృతి ఆయన సొంతమని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. దత్తపుత్రుడులా మనం తొడలు కొట్టలేం, బూతులు తిట్టలేం, వారిలా ఇష్టానుసారం మనం మాట్లాడలేమని ఆయన ఎద్దేవా చేశారు. దత్తపుత్రుడు నోటికి అదుపు లేదు, నిలకడ లేదని, దత్తపుత్రుడులా నాలుగేళ్లలో నలుగురు భార్యలను మార్చలేమని, ఈ పేటెంట్ ఒక్క దత్తపుత్రుడిదేనని ఆయన అన్నారు. రాష్ట్రంలో దుష్ట చతిస్త్యం సమాజాన్ని చీల్చితోందని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు.