క్యాన్సర్ వ్యాధి కట్టడికి విస్తృత పరిశోధనలూ జరుగుతున్నాయి. ఈ క్రమంలో మహమ్మారి వల్ల మరణాలను తగ్గించే శక్తిమంతమైన అస్త్రం టీకానేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్యాన్సర్ చికిత్సలో తదుపరి అతిపెద్ద ముందడుగు సమర్థ టీకాల రూపకల్పనేనని వారు పేర్కొన్నారు. టీకాకోసం దశాబ్దాల పాటు చేసిన పరిశోధనలు కీలక మలుపు తీసుకుంటున్నాయని అంటున్నారు. ఐదేళ్లలో ఈ తరహా వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని పేర్కొంటున్నారు.