మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. జలగావ్ ప్రాంతంలో ప్రత్యేక అవసరాలున్న వ్యక్తుల కోసం దీపస్తంభ్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు ఓ యువతి కాలితో తిలకం దిద్దారు. ‘ఇప్పటివరకు ఎందరో తల్లులు, సోదరీమణుల నుంచి నేను ఆశీర్వాదం తీసుకున్నాను. తిలకం స్వీకరించాను. ఓ సోదరి కాలి బొటనవేలు నా నుదిటిని చేరింది. ఈ క్షణాలు కళ్లు చెమర్చేలా చేస్తాయి’ అంటూ ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa