ప్రధానమంత్రి ఆహారశుద్ధి పరిశ్రమ స్థాపన (ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్) కు ఔత్సహికులకు తోడ్పాటు ఇవ్వనున్నట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఎ.పి.ఎఫ్.ఎస్) బి.జె.బిన్ని తెలిపారు. మినీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వము అందించే ఋణాలు సద్వినియోగం చేసుకోవాలనిశనివారం తెలిపారు. అప్పడాలు, వడియాలు, పచ్చళ్లు, కారపుపొడులు, బెల్లం తయారీ, బేకరీలు, నూనెగానుగలు, పిండిమరలు వంటి పరిశ్రమల స్థాపనకు పెట్టుబడి 10 శాతము పెడితే చాలని, మిగతా 90 శాతము కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంకు ఋణం రూపంలో అందిస్థాయని తెలిపారు. దీనిలో 35% శాతం రాయితీ నేరుగా బ్యాంకు ఋణానికి జమ చేస్తారని వివరించారు.ఈ పరిశ్రమల ఏర్పాటు పై ఆసక్తి ఉన్న వారు ఉద్యానశాఖ కార్యాలయానికి వచ్చి సంప్రదించాలని కోరారు.ఈ స్కీముకు సంబందించి మిగిలిన వివరాల కొరకు వివిధ మండలాలకు నియమించిన వివిధ డి. ఆర్.పి లను సంప్రదించాలని తెలిపారు.