ఓ భర్త తన భార్య ముక్కు కోసి దానిని జేబులో వేసుకుని పారిపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో జరిగింది. బన్ స్తలి గ్రామానికి చెందిన విక్రమ్ భార్య ఉండగానే మరో మహిళపై మోజుపడ్డాడు. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తన భార్య సీమాకు తెలియడంతో ఆమె నిలదీసింది. అయితే ఈ విషయమై గొడవ జరగడంతో కోపోద్రిక్తుడైన అతడు ఆమె ముక్కును కోసి జేబులో పెట్టుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa