ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా నగరానికి 48 కిలో మీటర్ల దూరంలోని పినాహట్‌లోని మన్సుఖ్‌పురా పోలీస్ స్టేషన్‌లో ఎక్కడ చూసినా తేళ్లు దర్శనమిస్తాయి. ప్రతి రోజు అరడజనుకుపైగా తేళ్లను అధికారులు చూస్తుంటారు. పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీసులు రోజూ తేళ్లను పట్టుకుని అడవిలో వదిలిపెట్టాల్సి వస్తోంది. తేళ్లను పట్టేందుకు ఇద్దరు హోంగార్డులకు బాధ్యతలు అప్పగించారు. అడవులు దగ్గరగా ఉండటంతోపాటు వర్షాకాలం వస్తే స్థానికంగా పాములు, తేళ్లు ఎక్కువగా వస్తుంటాయి.