మాజీ ప్రేయసిపై ప్రియుడి కర్కశత్వం.. కాళ్లూ చేతులు కట్టేసి సజీవదెయ్యాలు, భూతాలను విశ్వసించే ఓ వ్యక్తి తన భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం ఆమె మెదడును తిన్నాడు. ఆ తర్వాత భార్య శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి సంచుల్లో నింపి దూరంగా పడేశాడు. హత్యకు గురైన బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరా తీయడంతో అసలు విషయం బయట పడింది. వారికి ఐదుగురు సంతానం ఉన్నట్లు గుర్తించారు. ఈ ఒళ్లు గగుర్పొడిచే సంఘటన మెక్సికోలో వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు. నిందితుడు డ్రగ్స్, మద్యపానానికి బానిస అయ్యాడని బాధితురాలి తరఫు కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాధితురాలు మృతదేహాన్ని ముక్కలుగా చేసి పడేసిన ప్రాంతాన్ని గుర్తించిన పోలీసులు.. వాటిని వెలికి తీసే పనిలో పడ్డారు.
మెక్సికోలోని ఫ్యూబ్లా నగరంలో నివసించే 32 ఏళ్ల అల్వారోను పోలీసులు నిందితుడిగా గుర్తించారు. ఈ అత్యంత దారుణమైన ఘటన జూన్ 29 న తన ఇంట్లోనే హత్య చేసినట్లు విచారణలో అల్వారో అంగీకరించాడు. అదే ఇంట్లో నిందితుడిని జూలై 2 వ తేదీన అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అల్వారోకు చనిపోయిన 38 ఏళ్ల మరియా మోంట్‌సెరాట్ అనిమాస్ మోంటియెల్‌కు పెళ్లయి ఏడాది కూడా కాలేదని కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే మరియాకు అప్పటికే పెళ్లయి.. ఐదుగురు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. వారి వయసు 23 ఏళ్ల నుంచి 12 ఏళ్ల మధ్య ఉంటుందని పేర్కొన్నారు. పెళ్లయి పిల్లలు ఉన్న మరియాను.. అల్వారో మళ్లీ వివాహం చేసుకున్నాడని చెప్పారు. అయితే హత్య చేసిన సమయంలో అల్వారో డ్రగ్స్ తీసుకుని ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు.
అల్వారోను అరెస్ట్ చేసిన పోలీసులు.. విచారణలో కీలక విషయాలు రాబట్టారు. శాంటా ముర్టే అనే దయ్యం ఆదేశాల మేరకు తన భార్య మరియాను హత్య చేసినట్లు అంగీకరించాడు. హత్య తర్వాత ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసినట్లు ఒప్పుకున్నాడు. అనంతరం మరియా మెదడును బయటికి తీసి తిన్నట్లు చెప్పాడు. ఆ తర్వాత మరియా శరీర భాగాలను సంచుల్లో నింపి తన ఇంటి వెనకాల ఉన్న అటవీ ప్రాంతంలోని లోయలో పడేసినట్లు పోలీసులకు వివరించాడు. అయితే భార్యను చంపిన విషయాన్ని ఆమె కుమార్తెల్లో ఒకరికి ఫోన్ చేసి.. హత్య విషయాన్ని చెప్పినట్లు మరియా తల్లి మరియా అలీసియా మోనిటెల్ సెర్రాన్ వెల్లడించారు. మరియాను చంపి ప్లాస్టిక్ సంచుల్లో నింపి ఉంచానని వచ్చి తీసుకెళ్లాలని చెప్పినట్లు పేర్కొంది.
తన కుమార్తెను నిందితుడు అల్వారో అతి కిరాతకంగా సుత్తె, కొడవలితో హత్య చేశాడని మరియా తల్లి ఆరోపించారు. అమాయకురాలైన తమ కుమార్తెను అతడు ఎందుకు చంపాల్సి వచ్చిందని ఆమె ప్రశ్నించారు. మరియాకు చెందిన ఐదుగురు సంతానంలో ఇద్దరు చిన్నపిల్లలు మాత్రమే వారితో ఉంటారని.. మిగిలిన వారు వేరుగా ఉంటారని ఆమె తెలిపారు. అల్వారో పెద్ద పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడే వాడని.. మరియా తల్లి ఆరోపించారు. మరియా కుమార్తెలు స్నానం చేస్తుండగా.. చాటుగా చూసేవాడని.. వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని.. తెలిపారు. ఆ విషయాలన్నీ తెలిసి తన కుమార్తె కూడా అల్వారోను దూరం పెట్టేదని పేర్కొంది. అల్వారో ఒక బిల్డర్ అని.. అయితే అతడు మద్యం, డ్రగ్స్‌కు బానిస అయ్యాడని ఆరోపించారు. అతడు ఎప్పుడూ తన భార్యను హింసిస్తూ ఉండేవాడని తెలిపారు. ఈ ఘటనపై ఫ్యూబ్లా ప్రాసిక్యూటర్ కార్యాలయం సమగ్ర దర్యాప్తు జరుపుతోంది. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని మరియా తల్లి డిమాండ్ చేశారు. తన కుమార్తెకు సంబంధించిన శరీరభాగాలని తనకు అందిస్తే శవపరీక్ష నిర్వహిస్తామని తెలిపారు.
అల్వారో దయ్యానికి సంబంధించిన పోస్టులు.. సోషల్ మీడియాల్లో పెట్టేవాడని పోలీసులు గుర్తించారు. అల్వారో ఇంట్లో చేతబడికి సంబంధించిన కొన్ని వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. అతడు డ్రగ్స్‌కు బానిస కావడం వల్ల మానసిక సమస్యలు ఎదుర్కొనే వాడని గుర్తించారు. అతని కాలుమీద దయ్యానికి సంబంధించిన పచ్చబొట్టు కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే మరియాకు చెందిన మృతదేహానికి సంబంధించిన భాగాలు పూర్తిగా లభ్యం కాలేదని.. మరికొన్నింటిని గుర్తించాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. వాటికి డీఎన్ఏ పరీక్ష కూడా నిర్వహించాల్సి ఉంటుందని వెల్లడించారు.