దేశవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. జులై 7 నుంచి జులై 15 వరకు 300 ఎక్స్‌ప్రెస్, 406 ప్యాసింజర్ రైళ్లు రద్దు చేయబడ్డాయి. భారీ వర్షాల కారణంగా 600 ఎక్స్‌ప్రెస్, 500 ప్యాసింజర్ రైళ్లు దెబ్బతిన్నాయని రైల్వేశాఖ తెలిపింది. జమ్ముకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లలో జులై 8 నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు.