ఐదేళ్ల కాలంలో భారతదేశంలో 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని 'నీతి ఆయోగ్' తాజా నివేదిక వెల్లడించింది. దేశంలో పేదల శాతం...2015-16లో 24.85 శాతం ఉండగా, 2019-21 నాటికి 14.96 శాతానికి తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం 32.59 శాతం నుంచి 19.28 శాతానికి పడిపోయింది. పట్టణ ప్రాంతాల్లో 8.65 శాతం నుంచి 5.27 శాతానికి తగ్గింది. పేదరికం తీవ్రత 47 శాతం నుంచి 44 శాతానికి తగ్గినట్లు వెల్లడించింది. ఉత్తర ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ లలో పేదరికం అత్యంత వేగంగా తగ్గుతోందని వెల్లడించింది.