కొరియన్ ద్వీపకల్పంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. పొరుగుదేశం నుంచి ముప్పు పొంచి ఉందన్న ఆందోళనతో అమెరికాతో జట్టుకట్టిన దక్షిణ కొరియా క్రమం తప్పకుండా సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. వాషింగ్టన్, సియోల్ మధ్య రక్షణ సహకారం రోజు రోజుకు పెరిగిపోతుంది. దాంతో ఉత్తరకొరియా వరుసగా క్షిపణులను ప్రయోగిస్తోంది. బుధవారం జపాన్ సముద్ర తీరం వద్ద రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది.