చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని బైరెడ్డిపల్లి మండల కేంద్రంలో కొలువైన స్వసంత శేషాద్రిస్వామి ఆలయానికి వందల ఏళ్ల నాటి చరిత్ర ఉంది. 219 జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ ఆలయాన్ని సుమారు 14 వందల ఏళ్ల క్రితం నిర్మించినట్లు అర్చకులు చెబుతున్నారు. అప్పట్లో నిత్యంపూల భయేగౌడు అనే ఆయన ఈ ప్రాంత వ్యవహారాలు చూసుకునేవాడట. అయితే ఆర్థికంగా చితికిపోయిన భయేగౌడు.... ఓ రోజు తినడానికి తిండిలేక. రాజులకు శిస్తు చెల్లించేందుకు డబ్బులు లేక ఊరిబయట అడవిలో ఆకలితో అలమటిస్తూ పడుకున్నాడట. రాజు ఆజ్ఞానుసారం శిస్తు డబ్బులు వసూలు చేసుకునేందుకు వచ్చిన సిబ్బంది, భయేగౌడు పరిస్థితి చలించిపోయాడట. తన వద్ద ఉన్న డబ్బులనే శిస్తు రూపంలో చెల్లించాడట. అయితే ఆకలితో అలమటిస్తూ భయేగౌడు ఎక్కడైతే పడుకున్నాడో.. అక్కడే తాను స్వతంత శేషాద్రి స్వామిగా భూమిలో నిక్షిప్తిమైనట్లు భయేగౌడుకు ఆ స్వామి కలలో కనిపించాడని ఈ ఊరి జనం చెబుతున్నారు.
మరుసటిరోజు ఉదయం భయేగౌడు స్వామివారిని భూ నిక్షేపం నుండి పైకితీసి వైకాను ధర్మశాస్త్రం ప్రకారం ప్రతిష్టించినట్లు అర్చకులు చెబుతున్నారు. ఈ ఆలయ విశిష్టత ఇంకోటి కూడా ఉంది. ఈ ఆలయంలోని వెంకటేశ్వరస్వామికి శిరోభాగంలో నాగపడగ ఉంటుంది. స్వామివారి ప్రాగణంలో అప్పుడప్పుడు నాగు పాములు కూడా వస్తుంటాయట. మరోవైపు స్వామి వారి నిక్షిప్త స్థలంలో భారీగా నిధులున్నాయనీ... వీటిని ఎలా చేరుకోవాలో తెలియజేస్తూ ఆలయ ప్రాగణంలో 76 భాషలలో శిలాశాసనం వేశారని అర్చకులు చెబుతున్నారు.