ఏపీలో ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గుంటూరు జిల్లాలో కూడా మరో అధికారి ఏసీబీకి దొరికారు. తాడేపల్లిలోని AP సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీలో జాయింట్ సెక్రటరీగా పని చేస్తున్న ప్రసాద బాబు ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ప్రసాదబాబు గతంలో ఎస్సై, సీఐగా పనిచేశారు. ఆ తర్వాత 2007లో ఏపీఫీఎస్సీ ద్వారా గ్రూప్-I అధికారిగా ట్రెజరీస్ & అకౌంట్స్ డిపార్ట్‌మెంట్‌లో ఏటీఓగా చేరారు. ప్రస్తుతం ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీలో జాయింట్ సెక్రటరీగా హోదాలో విధులు నిర్వహిస్తున్నారు. దాడులలో కోట్లాది రూపాయల విలువైన అక్రమ ఆస్తులను అధికారులు గుర్తించారు.
ఆస్తుల వివరాలు:
1. ఏలూరులో రెండు ప్లాట్లు
2. విజయవాడ పోరంకి లో రెండు ప్లాట్లు
3. ఏలూరులోని మాదేపల్లిలో RCC ఇల్లు
4. ఏలూరు మాదేపల్లిలో భవనం
5. హైదరాబాద్ లోని బూదన్ పోచంపల్లి వద్ద G+2 భవనం
6. పామర్రు గ్రామంలో ఓపెన్ ప్లాట్
7. దెందులూరు మండలం 90 సెంట్ల వ్యవసాయ భూమి
గుర్తించిన వాహనాలు:
1. ఫోర్ వీలర్ స్కోడా ర్యాపిడ్ BS-VI
2. ఫోర్ వీలర్ మారుతి ఎర్టిగా SHVS ZDI+BSIV
3. ఫోర్ వీలర్ ఇన్నోవా సదన్
4. టూ వీలర్ బుల్లెట్ క్లాసిక్
5. ద్విచక్ర వాహనం యాక్టివా ఎలక్ట్రిక్ CBS BSIII
6. ద్విచక్ర వాహనం Activa 5G గ్రే కలర్ మోటార్ సైకిల్
7. గృహోపకరణాలు
8. సుమారు 500 గ్రాముల బంగారు ఆభరణాలు
9. నగదు రూ. 30,000
ఇతర ఆస్తులు:-
1. ఎల్‌ఐసీ పాలసీలు - రూ. 15,00,000
2. మౌనిక ఆక్వా ఫామ్‌ల పెట్టుబడి - రూ. 1,00,00,000
3. మౌనిక ఆక్వా ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఖర్చు -రూ. 30,00,000
4. ఇతర వ్యక్తుల కు ఇచ్చిన మూడు ప్రామిసరీ నోట్లు -రూ. 26,00,000