కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పకు శివమొగ్గలోని శివప్పనాయక అగ్రికల్చరల్ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. శివప్పనాయక అగ్రికల్చరల్ యూనివర్శిటీ 8వ స్నాతకోత్సవం శుక్రవారం జరుగనుంది. ఈ సందర్భంగా మాజీ సీఎం యడియూరప్పకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తామని యూనివర్శిటీ వైస్‌ఛాన్స్‌లర్ డాక్టర్ ఆర్‌సీ జగదీష్ తెలిపారు. గవర్నర్ థావరచంద్ గెహ్లాట్ ఛాన్స్‌లర్ హోదాలో పాల్గొంటారని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa