ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భగవద్గీత చదువుతూ సెక్స్ చేసే సన్నివేశం,,,,సేవ్ కల్చర్, సేవ్ ఇండియా ఫౌండేషన్ ఆగ్రహం

national |  Suryaa Desk  | Published : Sun, Jul 23, 2023, 08:54 PM

అణు పితామహుడు, అణుబాంబు సృష్టికర్త రాబర్ట్ ఒపెన్‌హైమర్ జీవితచరిత్ర ఆధారంగా నిర్మించిన చిత్రం ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. కానీ, ఈ చిత్రంలోని ఓ సన్నివేశం హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని పలువురు మండిపడుతున్నారు. అసలు ఈ సన్నివేశంతో ఉన్న సినిమాను సెన్సార్ బోర్డ్ ఎలా అనుమతించిందని వారు ప్రశ్నిస్తున్నారు. ‘ఈ సీన్‌తో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సినిమాను ఎలా అనుమతించిందనే విషయంపై గందరగోళానికి గురయ్యాం’ అని సేవ్ కల్చర్ సేవ్ ఇండియా ఫౌండేషన్ పత్రికా ప్రకటనను ఉటంకిస్తూ కేంద్ర సమాచార కమిషనర్ ఉదయ్ మహూర్కర్ అన్నారు.


రాబర్ట్ ఒపెన్‌హైమర్ (సిలియన్ మర్ఫీ) తన ప్రియురాలితో సెక్స్ చేస్తున్నప్పుడు భగవద్గీత చదువుతున్న సన్నివేశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సినిమాలోని ఓ సన్నివేశంలో ఒక స్త్రీ.. పురుషుడు భగవద్గీతను గట్టిగా చదివేలా చేసి శృంగారంలో పాల్గొన్నట్టు చూపిస్తోంది... దీనిపై సమాచార మంత్రిత్వ శాఖ తక్షణమే విచారణ జరిపి సంబంధిత వ్యక్తులను కఠినంగా శిక్షించాలి’ అని సేవ్ కల్చర్ సేవ్ ఇండియా ఫౌండేషన్ ఓ ప్రకటన చేసింది.


క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో వచ్చిన ఓపెన్‌హైమర్ R-రేటింగ్ వచ్చిన మొదటి సినిమా. అయితే, శృంగారం సన్నివేశం నిడివిని తగ్గించడానికి కొన్ని కత్తెర్లు వేసిన తర్వాత భారత్ సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A రేటింగ్ ఇచ్చింది. సెన్సార్ బోర్డ్ ఈ సన్నివేశాన్ని అనుమతించదని భావించి, ముందుగానే స్టూడియోలో ఎడిట్ చేసినట్టు నివేదికలు చెబుతున్నాయిరు.


ఈ చిత్రంపై సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నారు. పలువురు విమర్శకులు ఈ సినిమాకు 4.5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ‘ఓపెన్‌హైమర్ సాంకేతిక నైపుణ్యం, భావోద్వేగాలు, మానవ ప్రయత్నం, ఆశయం పరిమితుల పరిశీలన వంటి అద్భుతమైన కలయికతో రూపొందింది’ అని ఓ విమర్శకుడు ప్రశంసించారు.


అయితే, రాబర్ట్ ఒపెన్‌హైమర్‌ బయోపిక్‌లో భగవద్గీతను ప్రస్తావించడం వెనుక కారణం ఉంది. అణుబాంబు సృష్టించిన 'మాన్ హాటన్ ప్రాజెక్ట్ నిర్దేశకుడైన రాబర్ట్ ఒపెన్‌హైమర్ 1945లో మొదటి అణ్వాయుధ ప్రయోగాన్ని చూసినపుడు ఆ ప్రభావాన్ని వర్ణించడానికి భగవద్గీతలోని విశ్వరూప ఘట్టం (11-32) ఉదాహరించాడని అంటారు. అందుకే బయోపిక్‌లో గీతను ప్రస్తావించినట్టు తెలుస్తోంది. రాబర్ట్ ఓపెన్‌హైమర్ 1904లో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జన్మించాడు.


రెండో ప్రపంచ యుద్ధం సమయంలో చాలా రహస్యంగా.. భారీగా డబ్బు ఖర్చుపెట్టి అమెరికా ప్రభుత్వం రాబర్ట్ హైమర్‌తో మూడు అణుబాంబులని తయారుచేసింది. ఈ బాంబులు అనుకున్నట్టు పనిచేస్తున్నాయో లేదో పరిశీలించడానికి వాటిల్లో ఒకటి మెక్సికో ఎడారిలోని అలమగోర్డోలో ప్రయోగాత్మకంగా పేల్చి చూసింది. మిగతా రెండు జపాన్‌లోని హీరోషిమా, నాగసాకి నగరాలపై ప్రయోగించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com