అధికారంలో ఉన్న ఒక వ్యక్తి, వ్యక్తుల సముదాయం (మంత్రివర్గం/ప్రభుత్వం) ఆ అధికారాన్ని లేదా పదవిని నిర్వర్తించటానికి అనర్హులని భావిస్తున్నట్లు ప్రవేశపెట్టే తీర్మానాన్నే అవిశ్వాస తీర్మానం అంటారు. దీనికి కనీసం 50 మంది ఎంపీల మద్దతు లభించాలి. లోక్‌సభ సభ్యులు మాత్రమే దీనిని ప్రవేశ పెట్టడానికి అర్హులు. స్పీకర్ తీర్మానాన్ని స్వీకరిస్తే నోటీసు ఇచ్చిన పది రోజుల్లోపే చర్చకు తేదీలను నిర్ణయించాలి.