వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ కింద 2,64,532 మంది క్యాన్సర్ బాధితులకు ఉచితంగా వైద్యం అందించారు. ఇందుకోసం ప్రభుత్వం ఏకంగా రూ.1,801.30 కోట్లు ఖర్చుచేసింది. ఇదే 2014–19 మధ్య టీడీపీ హయాంలో క్యాన్సర్ చికిత్సకు కేవలం రూ.751.56 కోట్లు ఖర్చుచేశారు. అంటే.. నాలుగేళ్లలోనే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం టీడీపీ కంటే రూ.1,049.74కోట్లు అదనంగా ఖర్చుచేసింది అని వైసీపీ నాయకులు ఒక ప్రకటనలో తెలియజేసారు.