సీఎం జగన్ , తన ప్రభుత్వంలో అమలు చేస్తున్న జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం నిధులు నేడు లబ్ధిదారుల ఖాతాల్లో జమ కానున్నాయి. సీఎం వైయస్ జగన్ నేడు తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రూ.1.25 కోట్ల వరకు, ఇతరులకు రూ. కోటి వరకు 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్ అందుతుంది. ఈ విడతలో అర్హులైన 357 మంది విద్యార్థులకు రూ.45.53 కోట్ల నిధులను సీఎం వైయస్ జగన్ వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. గడచిన 6 నెలల్లో ‘జగనన్న విదేశీ విద్యా దీవెన‘ కింద వైయస్ జగన్ ప్రభుత్వం రూ.65.48 కోట్లు ఆర్థిక సాయం అందించింది.