అంబటి రాంబాబును అనుకరించాల్సిన అవసరం తమకు లేదని... ఆయన ఆస్కార్ స్థాయి నటుడేమీ కాదని నటుడు పృథ్వీ అన్నారు. ఇదిలావుంటే పవన్ కల్యాణ్ తాజా చిత్రం 'బ్రో'లో ఏపీ మంత్రి అంబటి రాంబాబు డ్యాన్స్ ను ఇమిటేట్ చేస్తూ ఒక డ్యాన్స్ ను పెట్టారు. ఈ డ్యాన్స్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ చేశారు. అంబటి రాంబాబు మాదిరే ఆయన సేమ్ డ్రెస్ వేసుకున్నారు. దీనిపై అంబటి విమర్శలు కూడా గుప్పించారు. ఈ నేపథ్యంలో పృథ్వీ స్పందిస్తూ అంబటిపై మండిపడ్డారు. అంబటి రాంబాబును అనుకరించాల్సిన అవసరం తమకు లేదని... ఆయన ఆస్కార్ స్థాయి నటుడేమీ కాదని అన్నారు. ఈ చిత్రంలో తనది ఒక బాధ్యత లేని పాత్ర అని... పబ్బులకు వెళ్తూ, అమ్మాయిలతో డ్యాన్స్ చేసే పాత్ర తనదని చెప్పారు. 'బ్రో'లో ఒక చిన్న పాత్ర ఉందని, రెండు రోజులు పని చేయాలని దర్శకుడు సముద్రఖని తనకు చెప్పడంతో ఆ పాత్ర చేశానని అన్నారు.
ఎవరినో కించపరుస్తూ సినిమాలో చూపించేంత నీచ స్వభావం పవన్ కల్యాణ్ ది కాదని పృథ్వీ అన్నారు. పవన్ వ్యక్తిత్వం చాలా గొప్పదని కొనియాడారు. సినిమాలోని డ్యాన్స్ ను వైసీపీ వాళ్లు మరోలా అర్థం చేసుకుంటే చేసేదేమీ లేదని అన్నారు. పవన్ ను వైసీపీ నేతలు దారుణంగా విమర్శించడాన్ని ఏమనాలని ప్రశ్నించారు. సత్తెనపల్లిలో అంబటి రాంబాబుపై పోటీ చేసేందుకు తాను సిద్ధమని పృథ్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంబటిని కచ్చితంగా చిత్తుగా ఓడిస్తానని ధీమా వ్యక్తం చేశారు. అంబటి వ్యాఖ్యలపై జనసేన శ్రేణులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయని చెప్పారు.