భారతీయ యువతులకు బ్రిటీష్ హై కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టే సువర్ణ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు భారత్‌లోని బ్రిటీష్ హై కమిషనర్ కార్యాలయం చెప్పింది. అయితే అందుకు కొన్ని షరతులు, నియమాలు, నిబంధనలు పెట్టింది. ఈ బ్రిటీష్ హై కమిషనర్ విధులు నిర్వర్తించేందుకు అప్లై చేసుకునే వారు భారత దేశానికి చెందిన యువతులై ఉండాలని పేర్కొంది. దీంతోపాటు వారి వయసు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలని తెలిపింది. అయితే అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఈ పోటీల్లో గెలిచి ఎంపికైన వారు ఒక రోజు భారత్‌లో బ్రిటీష్ హై కమిషనర్‌గా పనిచేస్తారని వివరించింది.
అక్టోబరు 11 వ తేదీన అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఈ అవకాశం కల్పించనున్నట్లు భారత్‌లోని బ్రిటీష్ హై కమిషనర్ అలెక్స్ ఎలిస్ తెలిపారు. ఈ పోటీలో పాల్గొనేందుకు దేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన 18 నుంచి 23 ఏళ్ల వయసు గల యువతులు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఈ పోటీల్లో పాల్గొని.. విజేతగా నిలిచి అంతర్జాతీయంగా తమలో ఉన్న ప్రతిభను, సామర్థ్యాన్ని చాటుకునేందుకు ఒక వీడియోను అప్‌లోడ్ చేయాలని సూచించారు. "స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు సాధించడంలో యువత ఏరకంగా మార్గం చూపగలదు?’’ అనే ప్రశ్నకు సమాధానాన్ని ఒక్క నిమిషంలో చెప్పి దాన్ని వీడియో రికార్డు చేయాలని తెలిపారు.
ఈ వీడియోను ట్విటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, లింక్‌డ్ఇన్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పంపించాలని సూచించింది. దరఖాస్తు దారులు పంపిస్తున్న వీడియోకు '@UKinIndia' అని ట్యాగ్ చేసి.. '#Dayofthegirl' అని హ్యాష్‌ట్యాగ్ ఇవ్వాలని పేర్కొంది. ఈ వీడియోతోపాటు ఆగస్టు 18వ తేదీ లోపు దరఖాస్తులను తమకు అందించాలని తెలిపింది. ఆ తర్వాత ఒక ఆన్‌లైన్ ఫాం నింపాల్సి ఉంటుందని అలెక్స్ ఎలిస్ వివరించారు. అక్టోబరు 11వ తేదీన అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బ్రిటిష్ హైకమిషన్ భారతీయ యువతుల కోసం ఒక ప్రత్యేక అవకాశాన్ని ఆవిష్కరించింది. సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ అనే థీమ్‌పై కేంద్రంగా జరిగే వార్షిక 'హై కమిషనర్ ఫర్ ఎ డే' పోటీలో పాల్గొనడానికి వారిని ఆహ్వానించింది.
భారత దేశ భవిష్యత్ మొత్తం యువతపైనే ఆధారపడి ఉందని.. వారు ఇలాంటి సవాళ్లకు ఖచ్చితంగా పరిష్కారాలు చూపుతారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నట్లు ఎలిస్ తెలిపారు. 2017 నుంచి ప్రతీ సంవత్సరం 'హై కమిషనర్ ఫర్ ఎ డే' పోటీని బ్రిటిష్ హైకమిషన్ నిర్వహిస్తోంది. ఈ పోటీలో గతేడాది ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోకు చెందిన 20 ఏళ్ల జాగృతి యాదవ్ ఎంపికైంది. ఆమె వివిధ వర్గాల వారితో ప్రత్యేక సమావేశాలు.. చర్చలకు అధ్యక్షత వహించింది. అనేక కార్యక్రమాలకు హాజరైంది. ఈ సందర్భంగా జాగృతి యాదవ్.. విదేశీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి.. వెస్ట్ యార్క్‌షైర్ మేయర్ ట్రేసీ బ్రాబిన్, విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ వంటి ప్రముఖులను కలిశారు.