కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (KGBV) పనిచేసే టీచర్లకు ఇటీవల 23 శాతం జీతాలు పెంచిన ఏపీ ప్రభుత్వం ఏప్రిల్ నుంచి అమలుచేస్తామని ప్రకటించింది. అయితే నిధుల కొరత కారణంగా 3 నెలలు జీతాల్లో కోత విధించి, జూలై నుంచి అమలు చేస్తున్నట్లు KGBV కార్యదర్శి మధుసూధనరావు వెల్లడించారు. దీనివల్ల ఒక్కో ప్రిన్సిపల్ నెలకు రూ.6,384, టీచర్లు రూ.5 వేల చొప్పున నష్టపోనున్నారు.