అసైన్డ్ భూములను అమ్ముకునేందుకు ఏపీ ప్రభుత్వం హక్కులు కల్పించిన విషయం తెలిసిందే. తాజాగా వాటి హక్కులపై ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. 1954 కంటే ముందు పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను నిషేధిత జాబితా నుండి తొలగించవచ్చని జిల్లా కలెక్టర్లకు తెలిపింది. పట్టాలు ఉన్నా లేకున్నా రికార్డుల్లో ఉన్న వివరాలను అనుసరించి 22(A) నుండి నిరభ్యంతరంగా తొలగించవచ్చని పేర్కొంది.