చిన్నారులు సెల్‌ఫోన్లు వాడకుండా చైనా కఠిన ఆంక్షలు విధించింది. ఇందుకు సంబంధించి చైనా సెల్‌ఫోన్ నియంత్రణ మండలి నిబంధనలను రూపొందించింది. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు రోజుకు గరిష్టంగా 2 గంటలు మాత్రమే సెల్‌ఫోన్‌లను ఉపయోగించడానికి అనుమతించాలి. 8 ఏళ్లలోపు పిల్లలకు రోజుకు 40 నిమిషాలు, 8-16 ఏళ్లలోపు పిల్లలకు ఒక గంట, 16-17 ఏళ్లలోపు పిల్లలకు 2 గంటల సెల్‌ఫోన్ వినియోగించేందుకు అనుమతిస్తారు.