కోర్టు పర్యవేక్షణలో వేలం వేసిన ఆస్తులను ఈడీ జప్తు చేయడం కోర్టు ధిక్కరణ కాదా? అని హైకోర్టు ప్రశ్నించింది. వేలంలో ప్రైవేటు వ్యక్తులు కొనుగోలు చేసిన అగ్రిగోల్డ్ ఆస్తులను ఈడీ జప్తు చేయడం కొనుగోలుదారులను ఇబ్బందులకు గురిచేయడమేనని వ్యాఖ్యానించింది. సీఐడీ జప్తు చేసిన అగ్రిగోల్డ్ ఆస్తులను తిరిగి జప్తు చేస్తూ ఈడీ ప్రొవిజనల్ ఉత్తర్వులు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో ఇరువైపుల వాదనలు ముగియడంతో న్యాయస్థానం తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి సోమవారం ఆదేశాలిచ్చారు.