ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ యుగంలో కంప్యూటర్ సైన్స్ కోర్సుకు భారీ డిమాండ్ ఉంది. దీంతో బీటెక్‌లో చేరేవారంతా సీఎ్‌సఈనే అడుగుతున్నారు. కానీ అందరికీ బీటెక్‌లో సీఎ్‌సఈ సీటు వచ్చే అవకాశం ఉండదు. అలాంటి విద్యార్థులు డిగ్రీలో కంప్యూటర్స్ కోర్సుల్లో చేరుతున్నారు. తాజాగా డిగ్రీని కూడా ఆనర్స్ పేరుతో నాలుగేళ్లు చేశారు. విద్యార్థులు కావాలనుకుంటే మూడేళ్లకు కూడా బయటకు రావొచ్చు. దీంతో డిగ్రీలో చేరి నాలుగేళ్లు చదివితే దాదాపుగా బీటెక్‌లో సీఎ్‌సఈకి సమానం అవుతుందని విద్యార్థులు భావిస్తున్నారు. డిగ్రీలో కంప్యూటర్స్ చదివిన విద్యార్థులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ఈకోర్సులకు డిమాండ్ వచ్చింది.