జాతీయ ఓబీసీ మహా సంఘ 8వ మహాసభ సోమవారం తిరుపతిలో జరిగింది. ఈ సభకి ముఖ్య అతిధిగా పాలొన్న ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ..... ఓబీసీల డిమాండ్ల కోసం పార్లమెంటులో మాట్లాడతానని, అవసరమైతే బయటకూడా పోరాడతానని చెప్పారు. రాజ్యాధికారం సాధించడం ద్వారానే ఓబీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం 52శాతం ఓబీసీలున్నారని చెబుతోందని, అయితే 60శాతం కంటే ఎక్కువే ఉన్నట్లు తన అంచనా అన్నారు. 22 శాతం ఉండే అగ్రవర్ణాలు 50 శాతం రిజర్వేషన్ కొనసాగించుకోవాలని పోరాడుతున్నారని, ఓబీసీలకు మాత్రం మొండిచేయి చూపిస్తున్నారన్నారు. న్యాయమూర్తుల నియామకాలు, కేంద్ర సంస్థల్లోని నియామకాల్లో ఓబీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు.