నేడు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం(ఆగస్టు 9) సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసి దినోత్సవం నిర్వహించాలని 1994లో ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు వంద దేశాలలో ఐదు వేల ఆదివాసీ తెగలు ఉన్నాయి. మొత్తం మీద వీరి జనాభా చూస్తే సుమారు నలభై కోట్లకు పైన ఉంది.