దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ మరో భారీ సేల్‌తో ముందుకొచ్చింది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను నిర్వహించిన ఫ్లిప్ కార్ట్ మళ్లీ మరో సేల్‌ను ప్రకటించింది. ఆగస్టు 11 నుంచి 13వ తేదీ వరకు మొత్తం 3 రోజుల పాటు బిగ్ బచాత్ ధమాల్ సేల్‌ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ సేల్‌లో దాదాపు లక్షకు పైగా ఉత్పత్తులపై ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్లు ఉంటాయని వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa