నియోజకవర్గ పరిధిలోని ఆయా మండల గ్రామల్లో శుక్రవారం, శనివారం కురిసిన వర్షాలు రైతులకు ఊరట కలిగించాయి. గత రెండు వారాలుగా వర్షాలు లేక సాగునీటి కాలువల ద్వారా సాగునీరందక ఖరీఫ్ పంట పొలాలు ఎండిపోయి నెర్రెలిచ్చి పోయాయి. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం శనివారం ఈదురు గాలుల తో కూడిన భారీ వర్షం రైతులకు కొంతమేర ఊరట కలిగించింది. దాంతో కొన్నిచోట్ల ట్రాక్టర్ల సహాయంతో దమ్ము పనులు, నాట్లు కూడా ప్రారంభించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa