77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము మాట్లాడారు. దేశ జీడీపీ ఏటా పెరుగుతోందని వివరించారు. భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని కొనియాడారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా గుర్తింపు పొందిన భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా దూసుకుపోతోందన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో భారత్ చేరుతుందన్నారు.