ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పందులను కాల్చబోతుండగా ,,,తూటా తగిలి చిన్నారి మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 15, 2023, 06:28 PM

కాకినాడలో నాటు తుపాకీ తూటాకు ఒక చిన్నారి బలైంది. ప్రమాదవశాత్తూ బుల్లెట్ తగలడంతో బాలిక మృతి చెందింది. ఈ విషాదకర ఘటన కాకినాడ జిల్లాలోని తుని మండలం వెలమకొత్తూరు గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. వెలమకొత్తూరు గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారి ధన్యశ్రీ ఇంటి సమీపంలో స్నేహితులతో కలిసి ఆడుకుంటోంది. అయితే అక్కడే కొంతమంది వ్యక్తులు నాటు తుపాకులు ఉపయోగించి పందుల్ని కాలుస్తున్నారు. పందులను కాల్చుతున్న సమయంలో ఓ తుటా గురితప్పి చిన్నారికి తగిలింది. ఈ ఘటనలో ధన్య శ్రీ అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందింది. బాలిక స్నేహితులు వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి వచ్చి చూడగా.. అప్పటికే చిన్నారి మృతి చెందింది. కూతురు మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమన్నీరవుతున్నారు.


ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. పోలీసులు దీనిపై విచారణ చేపడుతున్నారు. చిన్నారి ధన్మశ్రీ మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa