ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళలపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడిన వారు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులుగా ప్రకటిస్తామన్నారు. మహిళల సంక్షేమమే తమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాయ్‌పూర్‌లో జాతీయ జెండా ఎగుర వేసిన తర్వాత ఆయన ప్రసంగించారు. మహిళల భద్రతకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పారు.