కావలసిన పదార్థాలు
ఆలుగడ్డలు: నాలుగు, ఉల్లిగడ్డ: ఒకటి, గుడ్డు: ఒకటి, కార్న్‌ఫ్లోర్: ఒక టేబుల్ స్పూన్, మైదా: రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత, కారం: ఒక టీస్పూన్, జీలకర్ర: పావు టీస్పూన్, పచ్చిమిర్చి తురుము: ఒక టీస్పూన్, కరివేపాకు, పుదీనా తురుము: కొద్దిగా, నూనె: సరిపడా.
తయారీ విధానం
ఆలుగడ్డల్ని తురుముకుని బాగా కడిగి నీళ్లన్నీ పోయేలా కాటన్ క్లాత్‌పై ఆరబెట్టాలి. ఇప్పుడు, ఒక గిన్నెలో సన్నగా తురిమిన ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, పచ్చిమిర్చి, కార్న్‌ఫ్లోర్, మైదా, ఉప్పు, కారం, జీలకర్ర, కరివేపాకు, పుదీనా తురుము, కారం వేసి నీళ్లు పోయకుండా బాగా కలుపుకొని పదినిమిషాలు పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. వేడయ్యాక ఆలూ మిశ్రమాన్ని చిన్నచిన్న పాన్‌కేకుల్లా వేసుకుని రెండువైపులా ఫ్రై చేసుకోవాలి. గుడ్డు తిననివాళ్లు, ఇంకో స్పూన్ కార్న్‌ఫ్లోర్ జతచేసుకుంటే కరకరలాడే పొటాటో పాన్‌కేక్స్ రెడీ.