కావలసిన పదార్థాలు:
పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు: రెండు కప్పులు, చిరుధాన్యాల పిండి: అర కప్పు, శెనగపిండి: అర కప్పు, బియ్యపు పిండి: ఒక టేబుల్ స్పూన్, కారం: ఒక టీస్పూన్, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర తురుము: కొద్దిగా, పచ్చిమిర్చి: రెండు, అల్లం తురుము: అర టీస్పూన్, ఉప్పు: తగినంత, నెయ్యి: అర టీస్పూన్, నూనె: సరిపడా.
తయారీ విధానం:
ఒక గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు, చిరుధాన్యాల పిండి, శెనగపిండి, బియ్యపు పిండి, తరిగిన పచ్చిమిర్చితోపాటు నూనె మినహా మిగతావన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. అవసరమైతే కొన్ని నీళ్లు చల్లుకుని కాస్త గట్టిగా కలిపి పెట్టుకోవాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి, నూనె వేడయ్యాక పకోడి వేసుకుని ఎర్రగా కాల్చుకుంటే కరకరలాడే ఫలహారం సిద్ధం.