ఒకే కుటుంబానికి చెందిన సోదరులు గ్రూప్-1 సాధించి ఆదర్శంగా నిలిచారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పోలుమహంతి ఉమామహేశ్వరరావు బీసీ సంక్షేమశాఖలో పనిచేసి రిటైర్ అయ్యారు. నిన్న విడుదలైన ఏపీ గ్రూప్-1 ఫలితాల్లో ఆయన పెద్ద కుమారుడు వెంకట సాయిరాజేష్ అగ్నిమాపక శాఖలో, చిన్న కుమారుడు పి.వెంకట సాయిమనోజ్ వైద్యారోగ్యశాఖలో ఉద్యోగాలు సాధించారు. బీటెక్ పూర్తి చేసిన వీరిద్దరూ ఏడేళ్ల నుంచి సివిల్స్ శిక్షణ పొందుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa