బ్యాంకులు, NBFCలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈఎంఐ చెల్లించడం లేట్ అయితే అధిక వడ్డీలు విధించవద్దని సూచించింది. ఈఎంఐలు లేట్ అయితే అధిక మొత్తంలో జరిమానా/వడ్డీలు విధించాలని బ్యాంకులు భావించడం ఆందోళనకరమని పేర్కొంది. నిబంధనలు సవరించామని, కొత్త నిబంధనలు 2024 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. దీంతో రుణాలు తీసుకున్న వారికి ఊరట లభించినట్లైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa